: భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఈఫిల్ టవర్ ఎక్కేశారు!


కింగ్ స్టన్ కు సాహసాలు చేయడం అంటే మహాసరదా. అందుకే భారీ భవనాలు, పెద్దపెద్ద క్రేన్లు, కంపెనీల భారీ గొట్టాలు ఎక్కడం ద్వారా ఓ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే ఎత్తైన ఈఫిల్ టవర్ ను ఎలాంటి భద్రతా పరికరాల అవసరం లేకుండానే ఎక్కేశాడు. 1665 మెట్లు కలిగిన ఈఫిల్ టవర్ ను మెట్ల మార్గంలో ఎక్కాలంటేనే కష్టం. అలాంటిది ఎలాంటి సేఫ్టీ పరికరాల అవసరం తీసుకోకుండానే ఎక్కడం చాలా రిస్క్. అలాంటిది భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఏకంగా ఈఫిల్ టవర్ నే ఎక్కేశాడు. కింగ్ స్టన్ తో పాటు అతని సహచరుడు కూడా ఈఫిల్ టవర్ ను ఎలాంటి సేఫ్టీ లేకుండా ఎక్కి సంచలనం సృష్టించాడు. ఇప్పుడా వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందుగా టికెట్లు కొనుక్కుని ప్రవేశద్వారం గుండా ఈఫిల్ ఎక్కుదామని భావించామని, అయితే అక్కడ భారీ సంఖ్యలో జనాలు ఉండడంతో అది అసాధ్యమని భావించి, ఈఫిల్ టవర్ బయటి నుంచి ఎక్కేశామని తెలిపారు. రాత్రి సమయంలో సెక్యూరిటీని గమనించుకుంటూ నెమ్మదిగా ఎక్కడం ప్రారంభించిన వారిద్దరూ సీసీకెమెరాలు, సెక్యూరిటీ సిబ్బందిని తప్పించుకుని తెల్లారేసరికి టవర్ ఎక్కేశారు. అప్పటికే కింద ఉన్న సెక్యూరిటీ అధికారులు వారు కిందికి దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఆరు గంటలపాటు విచారించిన అధికారులు మరోసారి ఈఫిల్ టవర్ ఎక్కమని హామీ ఇవ్వడంతో వారిని విడిచిపెట్టారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News