: రేవంత్ రెడ్డీ! కారుకూతలు మానుకో!: ఎంపీ బాల్క సుమన్
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కారు కూతలు మానుకుని రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలంటూ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు గదులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లినా రేవంత్ రెడ్డి తీరు మారలేదు. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబుకాదు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని యూపీ వంటి రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్న విషయం రేవంత్ రెడ్డికి కనబడటం లేదా? ఆంధ్రా పాలకులు కొన్ని పిశాచాలను ఇక్కడి వదిలి వెళ్లారు. వారికి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కనబడటం లేదు’ అంటూ ఆయన ఆగ్రహించారు.