: డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆటగాడిని కొట్టిన ఫుట్ బాల్ స్టార్
పిల్లలు, యువతను అలరించే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆటగాళ్లపై చేయిచేసుకోవాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. అలాంటి ధైర్యాన్ని ఇంగ్లండ్ ఫుట్ బాల్ స్టార్ వేన్ రూనీ చేశాడు. పందెం పొట్టేళ్లను తలపించేలా భారీ దేహంతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వేదికపై తలపడే రెజ్లర్ పై వేన్ రూనీ ఎందుకు చేయిచేసుకోవాల్సి వచ్చిందంటే... అమెరికాలోని న్యూయార్క్ లో జరుగుతున్న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ ఈవెంటును చూసేందుకు వేన్ రూనీ కుమారుడితో సహా వెళ్లాడు. వేన్ గ్యాలరీలోకి రాగానే ప్రముఖ రెజ్లర్ వేడ్ బరెట్ అతనిని కామెంట్ చేయడం ప్రారంభించాడు. బరెట్ తో పాటు అతని అభిమానులు కూడా వేన్ రూనీని కామెంట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో సహనం కోల్పోయిన వేన్ రూనీ, వేడ్ బరెట్ పై చేయిచేసుకున్నాడు.