: మత విశ్వాసం లేనివారిని గౌరవించాలి: ఆధ్యాత్మిక గురువు దలైలామా
మత విశ్వాసం లేని వారిని మనం గౌరవించాలని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా సూచించారు. 'ప్రపంచ శాంతికి మానవ దృక్కోణం' అనే అంశంపై మద్రాస్ ఐఐటీలో దలైలామా మంగళవారం ఉపన్యసించారు. 'మీతో ఏకీభవించని వారిని నిర్మూలించాలనుకోవడం సరికాదు' అని ఆయన అన్నారు. అసమ్మతి గళాలను, మత విశ్వాసం లేని వారిని కూడా గౌరవించడమే అసలైన లౌకికవాదమన్నారు. మతసామరస్యంలో యావత్ ప్రపంచానికి భారత్ ఆదర్శప్రాయమని కొనియాడారు. తదుపరి దలైలామా మహిళ అయ్యే అవకాశముందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ...‘తప్పకుండా అవ్వొచ్చు’ అని ఆయన సమాధానమిచ్చారు. మహిళలు దేశాధిపతులైతే ప్రపంచం మరింత శాంతియుతంగా ఉంటుందని దలైలామా అభిప్రాయపడ్డారు.