: మోదీ జీ! మీరు రావద్దు: యూకే పార్లమెంట్ వద్ద కటౌట్


‘మోదీ, మీరు రావొద్దు’ అంటూ యూకే పార్లమెంట్ వద్ద భారీ కటౌట్ ఒకటి వెలిసింది. బ్రిటన్ ఇండో అసోసియేషన్ అయిన 'ఆవాజ్ యూకే' ఈ కటౌట్ ను అక్కడ ఏర్పాటు చేసింది. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు బ్రిటన్, టర్కీలో ప్రధాని మోదీ పర్యటించనున్న విషయం తెలిసిందే. టర్కీ రాజధాని అంకారాలో జరగనున్న జీ-20 దేశాల సదస్సులో మోదీ పాల్గొననున్నారు. బ్రిటన్ పర్యటనకు మోదీ తొలిసారి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ తో లంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి అక్కడ ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News