: టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్త : సీఎం కేసీఆర్
‘చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగ దీపావళి. ఈ పండగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా టపాసులు కాల్చేటప్పుడు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.