: ఐ డ్రాప్స్ తో కేటరాక్ట్ కు చెక్!
సర్జరీ అంటే భయం కారణంగా కేటరాక్ట్ (కంటిలో శుక్లాలు) ఆపరేషన్లకు దూరంగా వుంటున్న వారికి ఈ వార్త నిజంగా శుభవార్తే. ఎందుకంటే, కేటరాక్ట్ ఆపరేషన్ తో పనిలేకుండా కేవలం ఐ డ్రాప్స్ వేసుకోవడం ద్వారా పూర్వపు దృష్టిని తిరిగి పొందవచ్చన్న విషయం పరిశోధకుల నూతన అధ్యయనంలో వెల్లడైంది. ఆ బృందంలో భారత సంతతికి చెందిన ఒక పరిశోధకుడు కూడా ఉన్నారు. పరిశోధనల్లో భాగంగా ఒక కొత్త కెమికల్ ను వారు కనుగొన్నారు. ఈ కెమికల్ ను ఐడ్రాప్స్ లో కలిపి వాడటం ద్వారా సత్ఫలితాలు వస్తాయని, కేటరాక్ట్ ఆపరేషన్ తో పనిలేకుండా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక పరిశోధనా వ్యాసం ఒక మెడికల్ జర్నల్ లో ప్రచురించినట్లు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జాసన్ గెస్ట్ వికీ పేర్కొన్నారు. సంబంధిత రీసెర్చి పేపర్ కు కో-సీనియర్ ఆథర్ గా ఉన్న ఆయన ఇంకా పలు విషయాలు వెల్లడించారు. ‘శస్త్రచికిత్స ద్వారా కేటరాక్ట్ ను తొలగించవచ్చు. కానీ, అది ఖర్చుతో కూడుకున్నది. కేటరాక్ట్ ముదిరిపోయినప్పటికీ వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేస్తున్నవారి సంఖ్య అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బాగానే ఉంది’ అని జాసన్ గెస్ట్ పేర్కొన్నారు.