: సెలెక్టర్ మీరే అని బీసీసీఐ చెప్పడాన్ని నమ్మలేకపోయా: గగన్ ఖోడా


బీసీసీఐ నుంచి ఫోన్ రావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని టీమిండియా, రాజస్థాన్ జట్ల మాజీ ఓపెనర్ గగన్ ఖోడా తెలిపాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో విధులు నిర్వర్తించే తాను గత కొద్ది రోజులుగా క్రికెట్ కు దూరంగా ఉన్నానని, అయితే, సీనియర్ జట్టు సెలెక్టర్ గా ఎంపికయ్యానని బీసీసీఐ నుంచి ఫోన్ రావడంతో ఆశ్చర్యంతో పాటు ఆనందానికి లోనయ్యానని గగన్ ఖోడా చెప్పాడు. కేవలం రెండు సిరీసుల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన గగన్ ఖోడాను సెంట్రల్ జోన్ నుంచి బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్ ఎంపిక చేయడం విశేషం. కాగా, సౌత్ జోన్ నుంచి ఆంధ్రా క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ ను కూడా సెలెక్టర్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెస్కే గతంలో టీమిండియా సాంకేతిక నైపుణ్యం పెంపుదల విభాగంలో సేవలందించాడు.

  • Loading...

More Telugu News