: తెలుగు ప్రజలకు గవర్నర్, చంద్రబాబు, జగన్ దీపావళి శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. విభజన చీకట్లు తొలగి తెలుగు లోగిళ్లు కాంతిమయం కావాలని సీఎం కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినం అందరికీ సకల శుభాలు, సౌభాగ్యాలు కలిగించాలని, ఈ దీపావళి ప్రతి ఇంటా కాంతులు నింపాలని ఆకాంక్షించారు.