: ‘ఢిల్లీ మెట్రో’ పరిస్థితి ‘ముంబయి లోకల్స్’ను తలపిస్తోంది: కేజ్రీవాల్


ప్రయాణికుల రద్దీ కారణంగా ఢిల్లీలో మెట్రో రైళ్ల పరిస్థితి ముంబయి లోకల్స్ ను తలపిస్తోందని ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీ మెట్రోలో అదనపు బోగీలతో పాటు, ఆయా మార్గాలలో తిరిగే మెట్రో సర్వీసుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని జహంగీర్ పురి- సామ్యాపూర్ బాద్లీ ఎక్సెటెన్షన్ మార్గాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ మాట్లాడారు. కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. కొత్తగా ప్రారంభించిన మార్గంలో రెండు స్టేషన్ల పేర్లు మార్చాలన్న కేజ్రీవాల్ విజ్ఞప్తికి వెంకయ్యనాయుడు అంగీకరించారు.

  • Loading...

More Telugu News