: బంగారు బహుమతి గెల్చుకున్న ప్రిన్స్ జార్జ్ 'కేక్'


క్రిస్మస్ సందడి అప్పుడే మొదలవుతోంది. ఈ సందడిలో కేకులది ప్రత్యేక పాత్ర. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ కేక్ ఫెస్టివల్ ఇంగ్లండ్ లో జరిగింది. ఈ ఫెస్టివల్ లో వివిధ దేశాలకు చెందిన చేయితిరిగిన కేక్ తయారీదారులు పాల్గొన్నారు. మొదటి బహుమతి ప్రిన్స్ జార్జ్ 'కేక్'ను వరించింది. బ్రిటన్ రాజవంశానికి చెందిన మూడేళ్ల ప్రిన్స్ జార్జ్ ఆ కేకును ఎలా తయారు చేశాడా? అని ఆశ్చర్యపోకండి. బుల్లి సెలబ్రిటీ ప్రిన్స్ జార్జ్ సోదరి ప్రిన్సెస్ ఛార్లెట్ బాప్టిజం వేడుకల్లో ఎరుపు, తెలుపు దుస్తుల్లో కనువిందు చేసిన ప్రిన్స్ జార్జ్ అందర్నీ ఆకట్టుకున్నాడు. అచ్చం జార్జ్ ను పోలిన కేక్ ను వాల్సల్ కు చెందిన లారా మాసన్ తయారు చేసింది. 30 గంటల పాటు శ్రమించిన లారా ప్రిన్స్ జార్జ్ ను పోలిన రుచికరమైన, అందమైన కేక్ ను తయారు చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఈ కేక్ బంగారు బహుమతి సంపాదించింది.

  • Loading...

More Telugu News