: దేశవ్యాప్తంగా 7కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాలున్నాయి: దత్తాత్రేయ


దేశ వ్యాప్తంగా 7 కోట్ల 40 లక్షల మందికి పీఎఫ్ ఖాతాలు ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. పీఎఫ్ డబ్బును 5 శాతం ఈక్విటీలో పెట్టాలని తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని అన్నారు. బీడీ కార్మికులకు సెస్ పెంచాలని నిర్ణయించినట్టు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ప్రకటించారు. గతంలో కార్మిక శాఖలో జరిగిన అవినీతికి సంబంధించి ఎలాంటి ఘటనలు తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా దత్తాత్రేయ నేటితో ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు.

  • Loading...

More Telugu News