: నా కొడుక్కి నేర్పిన మొదటి పాఠం ఇదే!: జెనీలియా భర్త
బాలీవుడ్ నట దంపతులు జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ జంట తమ ముద్దుల కొడుకు రియాన్ గురించి గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బయ్యే రితేష్ తన కుమారుడికి నేర్పిన తొలి పాఠాన్ని ఇప్పుడు ఫోటో రూపంలో సోషల్ మీడియాలో పెట్టాడు. తండ్రిగా తన కుమారుడికి పెద్దలను గౌరవించాలనే పాఠం నేర్పానని పొంగిపోతూ ఆ విషయాన్ని అభిమానులకు తెలిపాడు. ఇప్పుడిప్పుడే నడుస్తున్న రియాన్ దేశ్ ముఖ్ ముందు తరాలను గుర్తు చేసుకుంటూ దేవుళ్ల విగ్రహాల ముందు నమస్కరిస్తున్న ఫోటోను ట్వీట్ చేశాడు. ఇది జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ అభిమానులను అలరిస్తోంది.