: త్వరలో ‘మైక్రోసాఫ్ట్’ సరికొత్త స్మార్ట్ ఫోన్లు !
సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10తో కూడిన మైక్రోసాఫ్ట్ లూమియా 950, లూమియా 950 ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్లు త్వరలో మార్కెట్లోకి రానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ రెండు కొత్త ఫోన్లు ఈ నెల 20 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఆ రెండు ఫోన్ల ఫీచర్ల విషయానికొస్తే... లూమియా 950 ఫీచర్లు... 5.2 ఇంచ్ క్యూహెచ్డీ డిస్ ప్లే, 1.8 జీహెచ్ జడ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ హెగ్జాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్,32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లూమియా 950 ఎక్స్ఎల్ ఫీచర్లు... 5.7 ఇంచ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 2 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 20 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 4కె వీడియో రికార్డింగ్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకుంది.