: భారత్-పాక్ ల సిరీస్ జరగాలని బీసీసీఐ గట్టిగా కోరుకుంటోంది: రాజీవ్ శుక్లా


డిసెంబర్ లో పాకిస్థాన్ తో జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ పై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా సానుకూలంగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సిరీస్ ను జరిపితేనే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భారత్-పాకిస్థాన్ ల సిరీస్ జరగాలని బీసీసీఐ కూడా గట్టిగా కోరుకుంటోందని చెప్పారు. అయితే ద్వైపాక్షిక సిరీస్ ను యూఏఈలో కాకుండా భారత్ లో జరిపితే బావుంటుందని శుక్లా పేర్కొన్నారు. ఇప్పటికే పాక్ తో క్రికెట్ సంబంధాలపై ప్రతిష్ఠంభన నెలకొనగా, సిరీస్ జరిగితే తిరిగి మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే తుది నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయంపైనే ఆధారపడి ఉందంటున్నారు.

  • Loading...

More Telugu News