: కర్నూలులో నాగార్జునా ఫ్యాన్స్ హల్ చల్... 'అఖిల్' టికెట్ల కోసం ఇద్దరి ఆత్మహత్యాయత్నం
రేపు విడుదల కానున్న నాగార్జున తనయుడు అఖిల్ తాజా చిత్రం 'అఖిల్' టికెట్లను అభిమానులకు ఇవ్వకుండా, బ్లాక్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ కర్నూలులోని ఆనం థియేటర్ వద్ద అభిమానులు ఆందోళనకు దిగారు. ఇద్దరు అభిమానులు మొదటి ఆటకు టికెట్లు దొరకలేదన్న మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వారిని నిలువరించి పోలీసు స్టేషన్ కు తరలించారు. టికెట్లను థియేటర్ యాజమాన్యమే అక్రమంగా విక్రయిస్తోందని ఆరోపించిన అభిమానులు రోడ్డుపై నిరసన తెలిపారు.