: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి రేపు నింగిలోకి ఇస్రో ఉపగ్రహం


యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఏరియానేస్పేస్ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన జీశాట్-15 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు అరబ్ శాట్-6బి ఉపగ్రహాన్ని కూడా పంపనున్నారు. ఇందుకోసం ఫ్రెంచ్ గయానాలోని యూరప్ స్పేస్ పోర్ట్ లాంచ్ జోన్ లో ఉపగ్రహాన్ని పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఉపగ్రహాన్ని తీసుకెళ్లే రాకెట్ నింగిలోకి దూసుకెళుతుంది. ఇన్ శాట్/జీశాట్ సిస్టమ్ లో జీశాట్-15 ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. మెరుగైన సమాచార సేవలను అందించేందుకు జీశాట్-15 ఉపయోగపడుతుంది. ఇది టెలికమ్యూనికేషన్, నావిగేషన్, అత్యవసర సేవలు అందిస్తుంది.

  • Loading...

More Telugu News