: డజన్ల కొద్దీ కార్లను మింగేసిన యూఎస్ సింక్ హోల్... మీరూ చూడండి!


అమెరికా, మిసిసిపీలోని ఓ ప్రధాన రహదారి. కార్లన్నీ వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఒక్కసారిగా భూమి కుంగింది. భూకంపం వచ్చిందేమోనని కార్లలో ప్రయాణిస్తున్నవారు భయాందోళనలకు గురవుతున్న సమయంలోనే, రోడ్డు 20 అడుగుల లోతుకు కుంగిపోయింది. అదే దారిలో ప్రయాణిస్తున్న డజన్ల కొద్దీ కార్లు అందులో పడిపోయాయి. అదో సింక్ హోల్. నీటి ప్రవాహం నిమిత్తం రోడ్డు కింద నిర్మించిన భూగర్భ సొరంగ మార్గం. ఆ దారి బలహీనపడటం కారణంగానే భూమి కుంగినట్టు అధికారులు తెలిపారు. కాగా, యూఎస్ లో ఈ తరహా సింక్ హోల్స్ కుప్పకూలడం ఇటీవలి కాలంలో పెరిగింది. మిసిసిపీలో కూలిన సింక్ హోల్ ను మీరూ చూడండి!

  • Loading...

More Telugu News