: చింతమనేనికి 150 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయని గతంలోనే చెప్పాం: ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి


టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారశైలిపై ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.విద్యాసాగర్ మండిపడ్డారు. చీటికిమాటికీ ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడాన్ని చింతమనేని మానుకోవాలని సూచించారు. కొల్లేరు అభయారణ్యంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేయడాన్ని అడ్డుకోబోయిన అధికారులపై దాడులు చేయడం అమానుషమని చెప్పారు. గతంలో కూడా మహిళా ఎమ్మార్వోపై ఆయన అనుచరులు దాడులు చేశారని గుర్తు చేశారు. తన ఇష్టా రాజ్యంగా చింతమనేని వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు కొల్లేరు ప్రాంతంలో 150 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయని... ఈ విషయాన్ని తాము గతంలోనే చెప్పామని తెలిపారు. కోమటిలంక వాసుల చిరకాల డిమాండ్ పేరుతో, తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం చింతమనేని రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. ఉద్యోగులపై దాడులను ఆపకపోతే, ఉద్యోగ సంఘాలతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News