: ముంబై వొడాఫోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్... సెల్ఫీ పోస్ట్ చేస్తే ఐఫోన్ 6ఎస్
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ వినియోగదారులకు వరుస దీపావళి ఆఫర్లు ప్రకటిస్తోంది. మొన్న దేశవ్యాప్త ఉచిత డేటా ప్రకటించిన ఈ సంస్థ, తాజాగా సెల్ఫీతో కూడిన ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఇది కేవలం ముంబై వినియోగదారులకు మాత్రమే. మొత్తం ముంబైలో 8.5 మిలియన్ల వొడాపోన్ వినియోగదారులు ఉన్నారు. వారంతా సెల్ఫీ దిగి తమ ఫేస్ బుక్ పేజీలో హ్యాష్ టాగ్ తో 'వొడాఫోన్ దివాలి' అనే పేరుతో పోస్ట్ చేయాలి. ఈ నెల 16 వరకు ఈ ఆఫర్ ఉంటుందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. వచ్చిన వాటిలో ఒక సెల్ఫీని విజేతగా ఎంపిక చేసి వారికి ఐఫోన్ 6ఎస్ బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.