: బీహార్ లో అనైతిక శక్తుల వల్లే నితీశ్ గెలిచారు: బీజేపీ ఏపీ నేత కన్నా సంచలన కామెంట్
బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవంపై బీజేపీ కీలక నేతలంతా అంతర్మథనంలో కూరుకుపోయారు. అయితే ఆ పార్టీకి చెందిన ఏపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మాత్రం కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. అనైతిక శక్తుల వల్లే నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమి బీహార్ లో విజయం సాధించిందని ఆయన గుంటూరులో వ్యాఖ్యానించారు. సాంకేతికంగా అధిక సీట్లు సాధించి నితీశ్ గెలిచినప్పటికీ బీహార్ లో నైతిక విజయం మాత్రం మోదీనేనని ఆయన తేల్చిచెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం తప్పక సాయం చేస్తుందని చెప్పిన ఆయన, మిత్రధర్మాన్ని పాటించే అంశాన్ని టీడీపీ నేతల నైతికతకే వదిలేస్తున్నామని కూడా కన్నా వ్యాఖ్యానించారు.