: ఏనుగు వెళుతుంటే కుక్కలే మొరుగుతాయి: శత్రుఘ్నసిన్హా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కమలం నేతలు శత్రుఘ్నసిన్హా, సీనియర్ నేత కైలాష్ విజయ్ వర్గియాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తనను వర్గియా కుక్కతో పోలిస్తే, ఇప్పుడు సిన్హా కూడా ఆయనను కుక్కతోనే పోలుస్తూ విమర్శించారు. "విజయ్ వర్గియా చేసిన వ్యాఖ్యలపై తన స్పందన ఏంటని పలువురు అడుగుతున్నారు. ఏనుగు బీహార్ వెళుతుంటే... వేలాది కుక్కలు మొరుగుతాయి" అదే తన సమాధానం అని షాట్ గన్ ట్వీట్ చేశారు. మొత్తానికి బీజేపీ నేతల మధ్య విమర్శలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి.