: 'రామ్ అన్నా' అంటూ... కేటీఆర్ కు ట్విట్టర్ లో నటుడు వివేక్ ఒబెరాయ్ పలకరింత


హైదరాబాద్ లో ఏ కార్యక్రమానికి పిలిచినా సినీ నటుడు వివేక్ ఒబెరాయ్ తప్పక హాజరవుతుంటాడు. కారణం తను పుట్టింది ఇక్కడే, కొంతవరకు చదువుకున్నాడు కూడా. అందుకే ఇక్కడి వారితో అంతే రిలేషన్ ను మెయింటెన్ చేస్తాడు, ఇక్కడి విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటాడు. త్వరలో హైదరాబాద్ లో అపాచీ హెలికాప్టర్ల తయారీ కోసం బోయింగ్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సంస్థలు జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ ట్వీట్ చూసిన వివేక్ ఒబెరాయ్ వెంటనే రీట్వీట్ చేశాడు. "వావ్! సూపర్ ఇంప్రెసివ్ రామ్ అన్నా! మీరు చేస్తున్న ప్రయత్నాల వల్ల 'హైదరాబాద్ హ్యాపెనింగ్' మాత్రమే కాక, 'టెర్రిఫిక్ తెలంగాణ'గా సాధ్యమవుతోంది" అంటూ పోస్టు చేశాడు. ఇందుకు స్పందించిన కేటీఆర్ కూడా, వివేక్ భాయ్ కు ధన్యవాదాలు అంటూ చెప్పారు. తమ హైదరాబాదీ ఒబెరాయ్ సాబ్ ఏం చేస్తున్నారని అడిగి, ఆయనకు తన వందనాలు తెలపాలని కోరారు. ఇక్కడ... హైదరాబాదీ ఒబెరాయ్ అంటే వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్. సిసలైన హైదరాబాద్ అయిన ఆయన ఒకప్పుడు బాలీవుడ్ లో రాజ్యమేలారు. అందుకే కేటీఆర్ అలా ప్రసావించారు.

  • Loading...

More Telugu News