: చైనా రోబో గిన్నిస్ రికార్డు... 134 కి.మీ నడిచిన 'వాకర్ 1'
చైనాకు చెందిన ఓ రోబో అత్యధిక దూరం నడిచి గిన్నిస్ రికార్డు సృష్టించింది. చైనాలోని చాంగ్ కింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లీ కింగ్దూ నేతృత్వంలోని బృందం 'వాకర్ 1' అనే నాలుగు కాళ్ల రోబోను తయారు చేసింది. ఈ రోబో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తో 54 గంటల్లో 134 కిలో మీటర్ల దూరం నడిచింది. ఇందుకోసం రోబోకు ఒక్కసారి చార్జింగ్ లేదా పెట్రోల్ పోస్తే అదంతా అయ్యేలోపు నిర్దేశిత దూరం ప్రయాణిస్తుంది. ఇంతకుముందు కార్నెల్ యూనివర్సిటికీ చెందిన రేంజర్ రోబో (65.18 కి.మీ నడిచింది) పేరుతో ఉన్న రికార్డును కూడా ఇది తిరగరాసింది.