: జోగయ్య వ్యాఖ్యల వెనుక రాజకీయ కారణాలున్నాయి: చినరాజప్ప


వంగవీటి రంగా హత్య వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని తన పుస్తకంలో రాసుకున్న హరిరామజోగయ్య వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం చినరాజప్ప మండిపడ్డారు. జోగయ్య వ్యాఖ్యలు సరికాదని అన్నారు. రంగా హత్యకు సంబంధించిన సమాచారం ఆయన వద్ద ఉన్నప్పుడు, దాని గురించి జోగయ్య అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జోగయ్య వ్యాఖ్యల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చే క్రమంలో ప్రస్తుత బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. త్వరలోనే ఏపీలో నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News