: ముంబై, కోల్ కతాలు సముద్రంలో కలిసిపోతాయట


గ్రీన్ హౌస్ వాయువుల వల్ల భూతాపం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో, ఆర్కిటిక్, అంటార్కిటిక్ లలోని మంచు కరుగుతోంది. ఈ క్రమంలో, సముద్ర మట్టం పెరుగుతోంది. ఇప్పటికే పలు చిన్నచిన్న దీవులు, తీర ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో, అమెరికాకు చెందిన క్లైమేట్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. విపరీతంగా అడవులను నాశనం చేయడం, అంతులేని వాతావరణ కాలుష్యం వల్ల ప్రపంచానికి తీవ్ర ముప్పు ముంచుకొస్తోందని హెచ్చరించింది. భూతాపం మరో 4 డిగ్రీలు పెరిగితే భారత్ లోని ముంబై, కోల్ కతా, చైనాలోని షాంఘై, బంగ్లాదేశ్ లోని ఖుల్ నా నగరాలు జలసమాధి అవుతాయట. దీని ప్రభావం 100 కోట్ల మంది ప్రజలపై పడుతుందని క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో కాకున్నా ఈ సిటీలలోని భూభాగం సగానికి పైగా సముద్రంలో మునిగిపోతుందని తెలిపింది. ఒకవేళ భూతాపం 2 డిగ్రీల మేర పెరిగితే ముప్పు స్థాయి కొంత మేర తగ్గినప్పటికీ, దాదాపు 2 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపనుందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News