: 200 మంది చిన్నారులను పొట్టనబెట్టుకున్న ఐఎస్ ఉగ్రవాదులు
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దారుణాలు హెచ్చురిల్లుతున్నాయి. ఈసారి వారి అకృత్యాలకు అభంశుభం తెలియని పసి పిల్లలు బలయ్యారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా ఏకంగా 200 మంది చిన్నారులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. వారిని చంపుతుండగా తీసిన వీడియో ఒకటి ఆన్ లైన్ లో పోస్టు చేశారు. అందులో పిల్లల్ని వరుసగా నిలబెట్టి అర నిమిషంలో తుపాకీతో పేల్చేశారు. గతంలో ఇలాగే కొంతమంది జర్నలిస్టులను చంపుతుండగా తీసిన వీడియో ఒకటి పోస్టు చేయగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.