: విద్యార్థుల త్యాగం ముందు... మీ త్యాగం కోడి ఈక పీకినంతే!: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ ఉపనేత రేవంత్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిన్న మహబూబ్ నగర్ లో జరిగిన సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి మరోమారు తన మాటల తూటాలు పేల్చారు. ‘‘తెలంగాణ కోసం త్యాగం చేశామని కేసీఆర్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. రెండ్రోజులు ఎల్లెలకల పడుకోవడమే త్యాగమైతే... విద్యార్థుల త్యాగం హిమాలయాలంత ఎత్తులో ఉంది. మీది కోడి ఈక పీకిన త్యాగమే’’ అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక్కో జిల్లాను ఒక్కో దొరకు అప్పగించి కేసీఆర్ దోపిడీ పాలనను సాగిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడేందుకు పోరాడాలని ఆయన విద్యార్థి సంఘానికి పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News