: భారత కంపెనీలపై భారీ ఫైన్ విధించిన యూఎస్


ఇండియా సహా వివిధ ఇతర దేశాల నుంచి ఉద్యోగులను రప్పించేందుకు హెచ్-1బీ వీసాలను అక్రమంగా వాడుకున్నారన్న ఆరోపణలపై ఎన్నారైలకు చెందిన రెండు కంపెనీలపై అమెరికా భారీ జరిమానా విధించింది. సిలికాన్ వ్యాలీలోని స్కోపస్ కన్సల్టింగ్ గ్రూప్, అరియాన్ ఇంజనీర్స్ కంపెనీలపై 1.03 లక్షల డాలర్ల (సుమారు రూ. 68.41 లక్షలు) జరిమానా, ఆపై 84 వేల డాలర్లను (సుమారు రూ. 55.79 లక్షలు) ఉద్యోగులకు చెల్లించాలని వాషింగ్టన్ కోర్టు ఆదేశించింది. ఈ కంపెనీలను కిషోర్ కుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. తక్కువ వేతనాలకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను యూఎస్ కు రప్పించేందుకు వీరు అక్రమదారుల్లో నడిచారు. ఉద్యోగులకు వేతనాలు సైతం సక్రమంగా చెల్లించలేదు. కేసు విచారించిన న్యాయస్థానం ఈ జరిమానాను విధించింది.

  • Loading...

More Telugu News