: వెంకన్న సేవలో అక్కినేని అఖిల్... కాలినడకన తిరుమల కొండకు చేరిన వైనం


టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని నిన్న దర్శించుకున్నాడు. తాను హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘అఖిల్’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న తిరుపతి చేరుకున్న అఖిల్ సినిమా విజయవంతం కావాలని అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశాడు. ఆ తర్వాత కాలిబాటలోనే అతడు తిరుమల కొండ చేరుకున్నాడు. కొండపై సన్నిధిలో వెంకన్నను దర్శించుకున్న అఖిల్ శ్రీవారి పాదాలను నెత్తిన పెట్టుకుని ఆలయ ప్రదక్షిణ చేశాడు.

  • Loading...

More Telugu News