: శ్రీశైలంలో సినీనటుడు శర్వానంద్


ప్రముఖ సినీ నటుడు శర్వానంద్ శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న శర్వానంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకం, కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పరమపవిత్రమైన, శక్తి పీఠమైన శ్రీశైలంలో ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఆనందాన్ని కల్గిస్తుందన్నారు. కాగా, గమ్యం, రన్ రాజా రన్ మొదలైన చిత్రాలతో శర్వానంద్ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News