: భారత్ లో ఏకే 47 తయారీ?


భారత్ లో అత్యంత శక్తిమంతమైన ఏకే 47 తుపాకులను తయారు చేయనున్నట్టు రష్యాకు చెందిన 'కలష్నికోవ్' కంపెనీ తెలిపింది. ఈ మేరకు భారతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు ఏకే 47లను తయారు చేసే 'కలష్నికోవ్' కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. భాగస్వామ్య పద్ధతిలో భారత్ లో కంపెనీ ఏర్పాటు చేసే దిశగా పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వారు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వంతో ఇంత వరకు దీనిపై చర్చించలేదని వారు వెల్లడించారు. 2008 నుంచి ఏకే 47 తయారు చేసేందుకు భారత కంపెనీలు సముఖంగా ఉన్నాయని, అయితే ఇంతవరకు చర్చల్లో ఏర్పడిన సమస్యల వల్ల కార్యరూపం దాల్చలేదని 'కలష్నికోవ్' కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్ లో ఏర్పాటు చేసే కంపెనీ నుంచి ఏటా 50 వేల రైఫిల్స్ తయారు చేసే యోచనలో ఉన్నట్టు 'కలష్నికోవ్' కంపెనీ తెలిపింది. అయితే దీనిపై రక్షణ శాఖతో చర్చించాల్సి ఉందని సదరు కంపెనీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News