: టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలను బహిష్కరిస్తాం: కర్నాటక బీజేపీ


కర్నాటకలో రేపటి నుంచి ప్రారంభం కానున్న టిప్పు సుల్తాన్ జయంత్సుత్సవాలను బహిష్కరిస్తున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ శాఖ ప్రకటించింది. కర్నాటక బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మత మౌఢ్యానికి మారుపేరైన టిప్పు సుల్తాన్ కన్నడ వ్యతిరేకి అని పేర్కొన్నారు. టిప్పుసుల్తాన్ పై అధికారికంగా నిర్వహించే ఏ కార్యక్రమానికీ తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పాల్గొనవద్దంటూ ఆదేశాలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులకు, జోనల్ ఆఫీసు బేరర్స్ కు ఈ ఆదేశాలు పంపామన్నారు. అంతేకాకుండా, కర్నాటక ప్రభుత్వం నిర్వహించనున్న ‘టిప్పు’ జయంత్యుత్సవాలను చాలా సంస్థలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తామన్న హెచ్చరికలు కూడా చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా, 18వ శతాబ్దానికి చెందిన టిప్పు సుల్తాన్ మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో, అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఆయనకు తీరని వైరం వుండేది. 1799లో శ్రీరంగపట్నం కోటను రక్షించుకునే క్రమంలో బ్రిటిష్ బలగాలతో పోరాడిన టిప్పు సుల్తాన్ వీరమరణం పొందాడు.

  • Loading...

More Telugu News