: 'మా దీపావళి సంబరాలు ఇంతే' అంటున్న వరుణ్ తేజ్, సందీప్ కిషన్, నిఖిల్


తమ ఇంట్లో దీపావళి అంటే పూజ చేసి ఇల్లంతా దీపాలతో అలంకరించడమని టాలీవుడ్ నటులు వరుణ్ తేజ్, సందీప్ కిషన్, నిఖిల్ పేర్కొంటున్నారు. హైదరాబాదులో వారు మాట్లాడుతూ, దీపావళి పేరు చెప్పి శబ్ద, వాతావరణ కాలుష్యం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాలుష్యం కారణంగా ఇప్పటికే చాలా జంతువులు అంతరించిపోయాయని వారు పేర్కొన్నారు. సరదా పేరిట చేసే టపాసుల హడావుడికి చిన్నపిల్లలు, మూగజీవాలు ఎంతో ఇబ్బంది పడతాయని వారు పేర్కొన్నారు. ఇతరులను ఇబ్బంది పెట్టి చేసుకునేది పండగ కాదని, అందుకే దీపావళిని దీపాలతో ఇంటిని అలంకరించి చేసుకోవాలని సూచించారు. క్రాకర్స్ కాల్చడం ద్వారా శబ్ద, వాతావరణ కాలుష్యం పెద్దఎత్తున ఏర్పడుతుందని, ఇప్పటికే వాహనాల ద్వారా పట్టణవాసులు పెద్దఎత్తున పొగ పీలుస్తున్నారని, దానికి దీపావళి కాలుష్యం అదనమని వారు పేర్కొన్నారు. మనం మరింత గొప్పగా ఆలోచించాలని ఆయన సూచించారు. కాలుష్య రహిత దీపావళి జరుపుకునేందుకు అంతా ఆసక్తి చూపాలని వారు సూచించారు. అలాగని దీపావళి జరపకుండా ఉండొద్దని, వెలుగులు పంచే టపాసులు కాల్చుకుని సందడి చేయమని వారు తెలిపారు. తాము గత కొన్నేళ్లుగా దీపావళి ఇలాగే జరుపుకుంటున్నామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News