: కస్టమరు ముఖంపై వేడివేడీ నూనె పోసిన యజమాని!


తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఒక హోటల్ యజమానికి, కస్టమర్ కు సెల్ ఫోన్ విషయమై చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన సదరు యజమాని వేడివేడి నూనె అతని ముఖంపై పోశాడు. ఈ సంఘటన కాకినాడ మండలం గొల్లల మామిడాడలో జరిగింది. సెల్ ఫోన్ విషయమై హోటల్ యజమాని సత్తిరెడ్డి, కస్టమర్ బుజ్జి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ వాదించుకున్నారు. దీంతో వివేకం కోల్పోయిన సత్తిరెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బుజ్జి ముఖంపై తీవ్రంగా గాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సత్తిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News