: నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్లయితే ఇంకొన్ని సీట్లు దక్కేవి: శత్రుఘ్నసిన్హా
‘బీహార్ లో బీజేపీ పార్టీ తరపున నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్లయితే, పార్టీకి ఇంకొన్ని సీట్లు వచ్చి ఉండేవి’ అని సినీనటుడు, ఆ పార్టీ నేత శత్రుఘ్నసిన్హా అభిప్రాయపడ్డారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఏదో గొప్పగా చెబుతున్నానని అనుకోవద్దు. ఒక మాట మాత్రం నిజం. ఈ నేలపై పుట్టినవాడిని. బీహారీలకు ప్రియమైన వాడిని. అసలు సిసలైన బీహారి బాబును నేను. అటువంటి నన్ను ఎన్నికల్లో పక్కన పెట్టడం వల్ల నా మద్దతుదారుల, ఫ్యాన్స్ ప్రభావం బీజేపీపై కొంతమేరకు పడింది. నా వల్ల చికాకు, ఇబ్బంది ఉందని ఒకవేళ బీజేపీ భావిస్తే.. నేను పార్టీలో ఉండను’ అని శత్రుఘ్నసిన్హా చెప్పారు.