: బాక్సైట్ తవ్వకాలు ఆపకపోతే రాజీనామా చేస్తా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల జోలికి రాకుండా ఉండటం మంచిదని వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాక్సైట్ తవ్వకాలు ఆపకపోతే, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆమె అన్నారు. బాక్సైట్ తవ్వకాల ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. తన పదవికి రాజీనామా చేసి, మళ్లీ తానే పోటీ చేస్తానని, తనపై పోటీ చేసేందుకు సీఎం చంద్రబాబు లేదా టీడీపీ కి చెందిన ఇతర నేతలెవరైనా సిద్ధమేనా? అంటూ ఆమె ప్రశ్నించారు. బాక్సైట్ మైనింగ్ అజెండాగా జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైతే సీఎం పదవికి బాబు రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు.