: నెల్లూరు లో భారీ వర్షం... అధికారుల అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలోని 11 మండలాలకు చెందిన అధికారులను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. కోట, ముత్తుకూరు, కావలి, టీపీ గూడూరు, వాకాడు, విడవలూరు, బోగోలు మొదలైన మండలాల్లో అధికారులు అప్రమత్తమైనట్లు సమాచారం. జిల్లా అధికారులకు సమాచారం తెలిపేందుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నంబరు 0861-2331477ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలిపారు.