: అవును! 'ఖాన్' లిద్దరూ కలిసిపోయారు...ప్రేమను పంచుకుంటున్నారు!


నిన్న మొన్నటి వరకు మత సంప్రదాయం ప్రకారం ఇఫ్తార్ విందులో కలుసుకునేందుకు కూడా ఇష్టపడని బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ఇప్పుడు కలిసిపోయారు. కలవడంతోనే ఆగలేదు. ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటున్నారు. ఒకరి సినిమా పాటలకు మరొకరు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తున్నారు. గతంలో కత్రినా కైఫ్ పుట్టిన రోజు వేడుక సందర్భంగా సల్లూభాయ్, షారూఖ్ గొడవ పడిన సంగతి తెలిసిందే. సల్మాన్ ప్రేయసిగా కత్రినా ఉన్న టైంలో ఈ గొడవ జరిగింది. అప్పటి నుంచి సల్మాన్, షారూఖ్ మధ్య మాట్లాడుకోడాల్లేవ్... వీరు కలుసుకున్న సందర్భాలు కూడా తక్కువే. తదనంతర కాలంలో సల్మాన్ ను వదిలించుకున్న కత్రినా, రణ్ బీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో పడింది. అలాగే షారూఖ్ తో కూడా నటించింది. ఇంతలో సల్లూభాయ్ తన చెల్లెలు అర్పిత వివాహం సందర్భంగా షారూఖ్ ను ఆహ్వానించాడు. ఆ వివాహం నుంచి కలిసిపోయిన వీరిద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒకరు అభిమానం కురిపించుకుంటున్నారు. డబ్ మాష్ ద్వారా సల్మాన్ నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాలో టైటిల్ సాంగ్ కు షారూఖ్ తన 'దిల్ వాలే' యూనిట్ తో కలసి డాన్స్ చేసి సోషల్ మీడియాలో పెడితే, ప్రతిగా షారూఖ్ బ్లాక్ బస్టర్ 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమాలో పాటకు తన యూనిట్ తో కలసి స్టెప్పులేసిన సల్మాన్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. వీరిద్దరి కొత్త ప్రేమకు వారి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

  • Loading...

More Telugu News