: తెలంగాణ రాష్ట్ర డీజీపీ బరిలో ముగ్గురు
తెలంగాణ రాష్ట్ర డీజీపీ బరిలో ముగ్గురు అధికారులు నిలిచారు. డీజీపీ ఎంపికలో భాగంగా ఆరుగురి పేర్లను పరిశీలించిన ప్యానల్... చివరికి ముగ్గురి పేర్లతో తుది జాబితాను తయారు చేసింది. ఆ జాబితాలో అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, అరుణ బహుగుణ పేర్లు ఉన్నాయి. రాష్ట్ర డీజీపీ ఎంపికపై ఢిల్లీలో ఇవాళ యూపీఎస్సీ కార్యాలయంలో సమావేశం జరిగింది. డీవోపీటీ, హోంశాఖ, యూపీఎస్సీ అధికారులు డీజీపీ ఎంపికపై చర్చించి పైవిధంగా జాబితా రూపొందించారు. ఆ ముగ్గురు పేర్లను ప్యానల్ రాష్ట్రానికి పంపనుంది. మరి, ఈ ముగ్గురిలో ఎవరు డీజీపీ అవుతారో తెలియాలంటే వేచిచూడక తప్పదు. ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా అనురాగ్ శర్మ కొనసాగుతున్నారు.