: చంద్రబాబు హెలికాప్టర్ ఎగిరేందుకు అనుమతివ్వని అధికారులు!


ఈ మధ్యాహ్నం కర్నూలు జిల్లా గోరుకల్లు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం, అక్కడి నుంచి గండికోటకు చేరుకునేందుకు హెలికాప్టర్ లో వెళ్లాలని చంద్రబాబు భావించగా, అధికారులు అందుకు అంగీకరించలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతమై ఉండటం, చినుకులు పడుతుండటంతో, చాపర్ ప్రయాణం ప్రమాదకరమని వారు వారించినట్టు తెలుస్తోంది. పైగా కర్నూలు జిల్లాపై క్యుములో నింబస్ మేఘాలు అధికంగా ఏర్పడుతుంటాయని వారు హెచ్చరించడంతో, హెలికాప్టర్ ప్రయాణాన్ని చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ఆపై రోడ్డు మార్గాన గండికోటకు బయలుదేరారు.

  • Loading...

More Telugu News