: ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభం
న్యూఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటమికి కారణాలపైన, ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైన ఈ మీటింగులో చర్చించనున్నారు.