: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డు అరెస్టు


ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన హైదరాబాదు శివారు బొల్లారంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, హెడ్ క్వార్టర్స్ లో హోం గార్డు విధులు నిర్వర్తిస్తున్న యాదయ్య, నిన్న రాత్రి మద్యం సేవించి స్థానిక సదరన్ బజార్ లో ఉంటున్న ఒక మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడటమే కాకుండా అత్యాచారయత్నానికి కూడా పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో పక్క ఇంటి వాళ్లు అక్కడికి వెళ్లి హోంగార్డును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News