: బీజేపీకి బీహారీలు గుణపాఠం నేర్పారు: అఖిలేష్ యాదవ్
బీహార్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ, నిన్న వెల్లడైన బీహార్ అసెంబ్లీ ఫలితాల ద్వారా అక్కడి ప్రజలు దేశానికి గొప్ప సందేశం ఇచ్చారని అన్నారు. బీజేపీ ఈ గుణపాఠం నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అద్భుతమైన విజయం సాధించిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ల మహాకూటమికి అభినందనలని ఆయన చెప్పారు. కాగా, నిన్న బీహార్ అసెంబ్లీ ఫలితాలు విడుదలై, తిరుగులేని విజయం సాధించిన అనంతరం ఆయన నితీష్, లాలూకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే.