: బీహార్ ఎన్నికలను దేశం మొత్తానికి ఆపాదించొద్దు: వెంకయ్యనాయుడు
బీహార్ లో బీజేపీ ఓటమితో దేశమంతా ఆ పార్టీకి ఇటువంటి పరిస్థితే ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. బీహార్ లో ఉన్న రాజకీయ పరిస్ధితే దేశమంతా ఉందన్న వాదనతో ఆయన విభేదించారు. ఒక రాష్ట్రంలోని ఫలితాలను దేశం మొత్తానికి ఆపాదించడం సరికాదని ప్రతిపక్షాలకు సూచించారు. బీహార్ లో మాత్రమే ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, ఎన్నికల ఫలితాలపై సమగ్రంగా విశ్లేషించుకుంటామని తెలిపారు. ఢిల్లీలో ఇవాళ రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ తరువాత వెంకయ్య మీడియాతో ఈ మేరకు మాట్లాడారు. ఎన్నికల ఫలితాలతో శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ఎటువంటి ఆటంకం కలగదనే అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.