: హైదరాబాదులో తయారు కానున్న అపాచీ హెలీకాప్టర్లు


పరిశ్రమలకు అనువైన ప్రాంతంగా పేరు సంపాదించుకున్న హైదరాబాదుకు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రానుంది. ప్రముఖ హెలికాప్టర్ల తయారీ సంస్థ అపాచీ హైదరాబాదులో ప్లాంట్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్, భారత్ లోని ప్రముఖ ఇండస్ట్రీ టాటాతో కలిసి ఈ ప్లాంటును నిర్వహించనున్నాయి. కాగా, విమానయాన రంగంలో వినియోగించే ఏహెచ్-64 రకం అపాచీ హెలికాప్టర్లను ఇక్కడ తయారు చేయనున్నారని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది తెలంగాణ వాసులకు పెద్ద శుభవార్త అని, త్వరలోనే హైదరాబాదులో హెలికాప్టర్లు తయారవుతాయని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News