: మయన్మార్ లో ఆంగ్ సాంగ్ సూకీ విజయం!
ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న మయన్మార్ పోరాటయోధురాలు ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్ డీ) అక్కడి సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికార పార్టీ 'ది యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ' (యూఎస్డీపీ)పై సూకీ పార్టీ ఈ విజయం సాధించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని, తుదిఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా అధికార యూఎస్డీపీ నేత హెచ్ టేే ఊ మాట్లాడుతూ, ‘మేం ఓడిపోయాము. మా ఓటమిని అంగీకరిస్తున్నాము. ప్రాథమిక అంచానాల మేరకు మేము అపజయం పాలయ్యాము. నా సొంత నియోజకవర్గంలో కూడా నేను ఓడిపోయాను' అని చెప్పినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది.