: ఆన్ లైన్లో అత్యంత ఆకర్షణీయ ఆఫర్ ఇదే!


భూమిక... ఈ పండగ సీజనులో ఫ్లిప్ కార్ట్ ప్రారంభించిన 'బిగ్ బిలియన్ డేస్' కానీ, అమేజాన్ మొదలెట్టిన 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్' కానీ, ఆమెను ఆకర్షించలేదు. స్నాప్ డీల్ 'ఎలక్ట్రానిక్స్ మండే' పేరిట దగ్గర చేసిన ఆఫర్లూ నచ్చలేదు. "నాకు తెలుసు. కొన్ని అద్భుతమైన ఆఫర్లు ముందున్నాయని. కానీ ఇంకా ఏదో కావాలని అనిపిస్తోంది" అని చెబుతోందీ 33 ఏళ్ల డిజైనర్. గత కొన్ని నెలలుగా తన పాత టీవీని కొత్త టీవీతో మార్చుకోవాలన్నది ఈమె అభిమతం. నవంబర్ 3 నుంచి పేటీఎం ప్రారంభించిన '100 శాతం వరకూ క్యాష్ బ్యాక్' ఆఫర్ భూమికను అమితంగా ఆకర్షించింది. ఎంఆర్పీ రూ. 77,900 ఉన్న 48 అంగుళాల శాంసంగ్ ఫుడ్ హెచ్డీ ఎల్ఈడీ టీవీని 20 శాతం డిస్కౌంటుతో రూ. 63,371కి కొనుగోలు చేసింది. అంతేకాదు, ఆమె పేటీఎం వాలెట్ లోకి రూ. 10 వేలు క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. "ఈ క్యాష్ బ్యాక్ తననెంతో ఆకర్షించిందని, వస్తువుపై డిస్కౌంట్ మన మనీకి విలువనిస్తే, క్యాష్ బ్యాక్ ఆ విలువను రెట్టింపు చేసింది" అని భూమిక అంటోంది. ఒక్క భూమికే కాదు... ఈ సీజనులో పేటీఎం దగ్గర చేసిన క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎందరినో ఆకర్షించింది. ఎన్నో రకాల ఉత్పత్తుల్లో ఆ సంస్థ 80 శాతం క్యాష్ బ్యాక్ ఇచ్చింది. ఆ డబ్బుతో పేటీఎంలోనే మరిన్ని ప్రొడక్టులు కొనుగోలు చేసి, వాటి నుంచి కూడా క్యాష్ బ్యాక్ పొంది మరిన్ని ఉత్పత్తులను నెటిజన్లు కొనేశారు. ఈ విధానం అద్భుత రీతిలో విజయవంతమైందని పేటీఎం ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. ఇక పేటీఎం మాధ్యమంగా పలు సంస్థలు ఈ కామర్స్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్ లో కలిశాయి. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన అభిషేక్, శివానీల జంట ఆన్ లైన్ డీల్ సైట్ 'పెప్పర్ టాప్' నుంచి రూ. 15 వేల ఇంటి సరుకులు కొని, పేటీఎం వాలెట్ నుంచి చెల్లించారు. ఆపై కాసేపటికే వారికి రూ. 5 వేల క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇలా పేటీఎం ఇచ్చిన తాజా ఆకర్షణీయ ఆఫర్లతో లాభపడిన వారెందరో. మిగతా సంస్థలతో పోలిస్తే వినూత్నంగా ఆలోచించడం, భారతీయుల అవసరాలు, మనస్తత్వాన్ని బట్టి కొత్త ప్లాన్లు, ఆఫర్లు ప్రకటించడం తమ విజయానికి నిదర్శనమని పేటీఎం యాజమాన్యం చెబుతోంది.

  • Loading...

More Telugu News