: మార్కెట్లోకి వచ్చేసిన మ్యాగీ నూడిల్స్
సీసం శాతం అధికంగా ఉందన్న వార్తలతో ఐదు నెలల కిందట దేశ వ్యాప్తంగా నిషేధం ఎదుర్కొన్న మ్యాగీ నూడిల్స్ తిరిగి మార్కెట్లోకి వచ్చేశాయి. నాణ్యతా పరీక్షల్లో విజయం సాధించి, నిషేధం నుంచి బయటపడి ఎట్టకేలకు ఇవాళ విపణిలోకి పునరాగమనం చేశాయి. ఇప్పుడు కొత్తగా ఆన్ లైన్ స్టోర్ స్నాప్ డీల్ ద్వారా కూడా మ్యాగీ నూడిల్స్ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాయని నెస్లే ఇండియా తెలిపింది. "ఇవాళ నుంచి మా నూడిల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేయడం మొదలుపెట్టాం. మ్యాగీ నిషేధం ఎదుర్కొన్న కాలం నెస్లేకు గడ్డుకాలం. పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా మళ్లీ మా ఉత్పత్తి సరైనదేనని నిరూపించుకున్నాం" అని నెస్లే తెలిపింది.