: రవిశాస్త్రి, రోజర్ బిన్నీలకు షాకిచ్చిన బీసీసీఐ
ఐసీసీ చైర్మన్ పదవి నుంచి ఎన్.శ్రీనివాసన్ ను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, జట్టు సెలెక్టర్ రోజర్ బిన్నీలకు కూడా షాకిచ్చింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి రవిశాస్త్రిని తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంతేకాక టీమిండియా సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న రోజర్ బిన్నీని కూడా ఆ పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వీరిద్దరినీ సదరు పదవుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాల వెనుక గల కారణాలు తెలియరాలేదు. ఇక ఐసీసీ చైర్మన్ పదవి నుంచి శ్రీని తప్పించడంతో పాటు ఆ పదవిలో బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్ ను నియమిస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికాసేపట్లో విడుదల కానుంది.